నిరుద్యోగుల చలో TGSPSC కి మద్దతు ప్రకటించి, బయల్దేరింది బీఆర్ఎస్వీ. ఈ తరుణంలోనే… BRSV స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు విద్యార్థి నాయకులు, విద్యార్థులు. TGPSC ముట్టడికి నిరుద్యోగ జేఏసి పిలుపు నిచ్చింది.
చలో TGPSC పేరుతో ఆందోళనకు సిద్ధమైంది నిరుద్యోగ జేఏసి. దీంతో TGPSC వద్ద భారీగా మోహరించారు పోలీసు బలగాలు. నిరసనను అడ్డుకునేందుకు వాటర్ కేనాన్లను పెట్టారు పోలీసులు. అటు నగరమంతా మెట్రో స్టేషన్ల వద్ద సైతం చెకింగ్ చేస్తున్నారు పోలీసులు.
అమీర్ పేట్, RTC క్రాస్ రోడ్, దిల్ షుక్ నగర మెట్రో స్టేషన్ ల వద్ద చెక్ చేసి ప్రయాణికులను పంపిస్తున్నారు పోలీసులు. మెట్రో లో TGPSC వద్దకు వస్తారని పోలీసుల పహారా కొనసాగుతోంది. అటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసి, BJYM నేతలు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో పోలీసు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.