మెడికల్ విద్యార్థులకు అలర్ఠ్.. BSC నర్సింగ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగించారు. తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 5 వరకు పొడిగించినట్లు కాలేజీ హెల్త్ వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్లు, రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు వేరువేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. బీఎస్సీ నర్సింగ్ లో చేరాలంటే ఎంసెట్ లో అర్హత సాధించాలనే విషయం తెలిసిందే.
కాగా, కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ సేవలకు ప్రత్యేక నర్సింగ్ కోర్సు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది కేసీఆర్ సర్కార్. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని MNJ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక బీఎస్సీ ఆంకాలజీ నర్సింగ్ కోర్సు ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించి, సాధారణ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు ప్రవేశానికి అర్హులు. 50 సీట్లతో ఈ కోర్సు ప్రారంభిస్తామని MNJ డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు.