ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు

-

తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ షురూ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్‌కు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల తర్వాత 12,001 (14.52 శాతం) సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి.

ఇంజినీరింగ్‌లో మొదటి విడతలో 85.48 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 82,666 సీట్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతోంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్‌ సూచించారు. కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్‌లో 44.76, మెకానికల్‌లో 38.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 3 యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లన్నీ నిండాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలనకు 76,821 మంది హాజరయ్యారు. ఇవాళ మొదటి విడతలో 70,665 సీట్ల కేటాయింపు పూర్తయింది. మరో 12,001 సీట్లు మిగిలాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,576 సీట్లు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news