మరో వివాదంలో చికోటి ప్రవీణ్

-

క్యాసీనో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ ఆదివారం హైదరాబాద్ లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మరో వివాదంలో చిక్కుకున్నారు చికోటి. తన ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఆయన ఆలయం లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతా సిబ్బంది వద్ద గన్ ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆలయం లోపలికి వెపన్స్ తో ప్రవేశించడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రవీణ్ వ్యక్తిగత సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

జన సమూహంలోకి ప్రైవేట్ సెక్యూరిటీతో రావడం చట్టరిత్యా నేరమని పోలీసులు తెలిపారు. చికోటి కి చెందిన ముగ్గురు ప్రైవేట్ సిబ్బందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వెపన్స్ కి లైసెన్స్ లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అయితే తన సెక్యూరిటీ సిబ్బందిని అరెస్టు చేయడంపై చికోటి ప్రవీణ్ తాజాగా స్పందించారు. తన సెక్యూరిటీ సిబ్బంది ఆలయం బయటే ఉన్నారని.. వారి వెపన్స్ కి లైసెన్స్ ఉందని తెలిపారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కనీసం ఎంక్వయిరీ కూడా చేయకుండా తన సిబ్బందిని అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇదంతా ఎవరో కావాలనే చేయిస్తున్నారని ఆరోపించారు చికోటి.

Read more RELATED
Recommended to you

Latest news