బడ్జెట్ అంతా అంకెల గారడీనే – ఈటెల రాజేందర్

-

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని విమర్శించారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని అన్నారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని కీలక ఆరోపణలు చేశారు.

నాలుగేళ్లయిన రైతాంగానికి రుణమాఫీ చేయలేదన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని, అది కూడా రెండేళ్లకోసారి ఇస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతుందని తెలిపారు. గురుకులలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మన ఊరు – మనబడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుంది అని అన్నారు. రైతులు పూర్తిగా రుణమాఫీ చేయాలని కోరుతున్నారని.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version