ఏపీలో ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం

-

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కులాల వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. వర్గీకరణలో భాగంగా గ్రూప్ 1లో 12 ఉప కులాలను 1 శాతం, గ్రూపు 2లో 18 ఉప కులాలకు 6.5 శాతం, గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్ 1 బిడ్డర్ కి అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ పర్ క్లైమేట్ అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేన్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది.

Read more RELATED
Recommended to you

Latest news