రైతులకు భారత వాతావరణ కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతాయని చెప్పింది. సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది 105 శాతం వర్షపాతానికి అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. రైతులు వర్షాదారిత పంటలు వేసుకొచ్చని సూచన చేసింది.
మరోవైపు ఇప్పటికే తెలంగాణలో రానున్న వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందన్న భారత
వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో వడదెబ్బల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని ఐఎండీ సూచించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. హీట్వేవ్ , సన్ స్ట్రోక్ (వడదెబ్బ)లను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా (స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్) ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం
అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.