కేటీఆర్ అరెస్టు పై ఏమి చెప్పలేను : మంత్రి పొంగులేటి

-

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ అనుమతి పై కేబినెట్ లో చర్చ జరిగింది. ఈ-కారు రేసు వ్యవహారంలో చట్ట ప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. కేటీఆర్ ను విచారణ చేపట్టేందుకు అనుమతి లభించిందని.. గవర్నర్ అనుమతి ఇస్తూ జారీ చేసిన దస్త్రాన్ని ఇవాళ రాత్రి లేదా మంగళవారం సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి పంపిస్తారని చెప్పారు మంత్రి పొంగులేటి.

Ponguleti

ఈ ఫార్ములా రేస్ పై జరిగిన దోపిడీ పై కేబినెట్ చర్చించినట్టు వెల్లడించారు. కేటీఆర్ అరెస్ట్ పై తాను చెప్పలేను. చట్టం తన పని తాను చేస్తుందని.. బాంబు తుస్సుమందని ఇటీవలే బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. అది తుస్సుమనేదైతే.. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లా కాకుండా గూండాల్లా ప్రవర్తించారు. మాట్లాడటానికి అంశం లేనందుకే ప్లకార్డులు, నినాదాలతో సభకు ఇవాళ ఆటంకం కలిగించినట్టు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version