ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది నారా చంద్ర బాబు నాయుడు కూటమి సర్కార్. మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువుపైన తాజాగా కీలక ప్రకటన చేసింది నారా చంద్ర బాబు నాయుడు కూటమి సర్కార్. మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువును మరింతగా పొడిగించినట్లు తెలియజేశారు. వ్యవసాయ శాఖ మామిడి బీమా ప్రీమియం చెల్లింపును ఈ నెల 31 వరకు పెంచినట్లు ఏపీ కౌలు రైతు సంఘం వెల్లడించింది.
రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కౌలు రైతు సంఘం పిలుపునిచ్చింది. మామిడి సాగుదారులు కౌలు దారుల పేరుతోనే ఈ క్రాప్ చేయాలని, ప్రీమియంలో రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిం చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరినట్లుగా సంఘ అధ్యక్షుడు రాధాకృష్ణ వెల్లడించారు. ఇక ప్రకటనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.