గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా కేటీఆర్ పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.
ఇది ఇలా ఉండగా… తాజాగా పార్టీ మారుతున్న నేతలను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. “శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడుని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు. అంటూ పోస్ట్ పెట్టారు కేటీఆర్.