Sabitha Indra Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి కేసు ఒకటి తెరమీదకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేసులో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను సిబిఐ కోర్టు కొట్టేసింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపిచ్చింది.

మంత్రి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కూడా కొట్టేసింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు కృపానందం, వీ.డి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి, పిఏ ఆలీ ఖాన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్లను సైతం సిబిఐ న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్ధన్, డివి శ్రీనివాస్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లను గతంలోనే ఉపసంహరించుకున్నారు. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేస్తూ అభియోగాల నమోదు తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version