కవితపై CBI ఎంక్వయిరీ చేస్తుంది – బిజెపి ఎంపీలు

-

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని బిజెపి ఎంపీలు పర్వేష్ వర్మ, సుధాంషు త్రివేది లు ఆరోపిస్తున్నారు. కవితపై తాము చేసిన ఆరోపణలలో సిబిఐ ఎంక్వయిరీ చేస్తుందన్నారు బిజెపి ఎంపీలు.

ఎంక్వయిరీ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారు అనే నిజా నిజాలు బయటకి వస్తాయన్నారు. కవిత పై ఆరోపణలు చేస్తే మా ఆరోపణలపై కవిత ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్నా అవినీతి వారికి కొత్త ఏమీ కాదన్నారు బిజెపి ఎంపీలు. సిబిఐ, ఈడి ప్రయోగిస్తున్నారు అన్న కవిత ప్రతిపక్షాల వ్యాఖ్యలు కొత్తవి ఏమీ కావన్నారు. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణంలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు లేరా? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version