బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మ వివాదంలో చిక్కుకున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ… మహహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఆ వీడియోను విడుదల చేశారు. దీంతో భగ్గుమన్న… ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశాయి.
అయితే.. బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. ఎనిమిది ఏళ్లు తెలంగాణ ప్రశాంతంగా ఉందని.. ముస్లింలను బీజేపీ ద్వేసిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రశాంతత లేకుండా బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం బీజేపీ ఇష్టం లేదని మండిపడ్డారు.
Fight with us politically but not like this. If PM Modi and BJP don't support these comments then they should react. I also condemn the slogans (Sar Tan Se Juda) that were raised and will say to those people to not take law in their hands: AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/IHVuADBfvg
— ANI (@ANI) August 23, 2022