రానున్న రోజుల్లో.. దేశంలో ఎదురయ్యే పవర్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉంది. అయితే బొగ్గు లేకుండా విద్యుదుత్పత్తి సాధ్యం కాదు.కాబట్టి బొగ్గు ఉత్పత్తిని పెంచేదిశగా మరింత కృషి జరగాలి అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల సంక్షేమం, గనులకోసం భూములు వదిలి వెళ్తున్న వారందరి సంక్షేమం గురించి ఆలోచించాలి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి.
మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్స్ లు తమ ప్రాంతం నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటామని అనుకోవద్దు. పర్మినెంట్ ఉద్యోగాలిస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలిస్తారా? మీ ఇష్టం కానీ స్థానికులకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. MDOలు మానవత్వంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాలి. కోల్ బేరింగ్ ప్రాంతాల్లో కాలుష్యం విస్తరించకుండా.. అటవీకరణపై దృష్టిపెట్టాలి. మైనింగ్ పూర్తయిన గనులను మూసి వేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. ప్రపంచంలో ఆదర్శవంతమైన విధానాలతో మైనింగ్, ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ పై దృష్టిపెట్టాలి. భాగస్వామ్య పక్షాలన్నీ దీనిపై ప్రత్యేక శ్రద్దతో పనిచేయాలి. ఇందుకోసం పూర్తి అంకితభావంతో పనిచేద్దాం అని కిషన్ రెడ్డి సూచించారు.