కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు..అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మెడలను వంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 1200 మందిని బలి తీసుకుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆలస్యానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దోచుకోవడం.. దాచుకోవడం మాత్రమే తెలుసు. ఇక తప్పని పరిస్థితిలో మాత్రమే తెలంగాణను ఇచ్చారు అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను ఏవి అమలు చేయలేదని.. ప్రస్తుతం కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లను ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ హామీలు ఇస్తుందన్నారు. మరోవైపు తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా మోసం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులంతా ఎక్కడ పోయారు. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఉద్యమం చేయలేదు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. అసలు ఉద్యమకారులంతా పక్కకు బోయారు. తెలంగాణ లో కేసీఆర్ ఫ్యామిలీ పాలనకు సమయం దగ్గర పడిందన్నారు.