తెలంగాణలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & పార్లమెంట్ ప్రవాస్ యోజన రాష్ట్ర ప్రముఖ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల మహా జన సంపర్క అభియాన్ కార్యక్రమాలలో భాగంగా సభలు సమావేశాల్లో పాల్గొనేందుకు బిజెపి జాతీయ నాయకులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారన్నారు.
ప్రజలతో మమేకం కావడం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడం అమలుతీరును పరిశీలించడం జరుగుతుందని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహల్లాద్ జోషి నేడు పర్యటిస్తున్నారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డా .భారతి బెన్ దీరుభాయ్ శియాల్ (DR. BHARATIBEN DHIRUBHAI SHIYAL) నేడు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారు. రేపు భువనగిరి పార్లమెంటు పరిధిలో పర్యటిస్తారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ జీ నేడు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో, రేపు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటిస్తారు. బిజెపి జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సహా ఇంచార్జ్ శ్రీ అరవింద్ మీనన్ నేడు మెదక్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారని వివరించారు.