డిగ్రీ సిలబస్, కోర్సుల స్వరూపంలో మార్పులు..!

-

మొదటి సంవత్సరంలో థియరీ క్లాసులు, రెండో సంవత్సరంలో స్కిల్లింగ్.. మూడో సంవత్సరంలో అనుభవపూర్వకమైన అభ్యసనం.. ఇలా వినూత్నంగా డిగ్రీ కోర్సులను కొత్తపుంతలు తొక్కించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కోర్సుల స్వరూపంలో సమూల మార్పులు చేసింది. పూర్తిగా తరగతి బోధన విధానానికి ముగింపు పలకనుంది.

విద్యార్థులు డిగ్రీలు పుచ్చకుంటున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం లభించడంలేదు. కేవలం అడ్మిషన్
దొరికితే చాలు. పరీక్షలు రాస్తే సరి. మూడేండ్లల్లో డిగ్రీ సర్టిఫికెట్ చేతికొచ్చేస్తుంది. ఫలానా కోర్సు పూర్తి చేస్తే.. ఫలానా కొలువు లభిస్తుందన్న గ్యారెంటీని మన విద్యావిధానం ఇవ్వలేకపోతున్నది. దీంతో కాలేజీలు నిరుద్యోగులను తయారుచేసే కార్ఖానాల్లా తయారయ్యాయి. ఈ విధానానికి ముగింపు పలికేందుకు ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ఇందుకోసం కామన్ కరిక్యులాన్ని సిద్ధంచేస్తున్నది. ఇప్పుడున్న సిలబస్ లో భారీ మార్పులు చేస్తూ.. 30శాతం మార్చనుంది. 2025 మార్చి లోపు కామన్ కరిక్యులాన్ని సిద్ధం చేసి, జూన్లో ప్రవేశపెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news