ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్.. ఎల్బీ న‌గ‌ర్ అండ‌ర్ పాస్‌ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

-

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం ఎంత అభివృద్ధి చెందుతుందో.. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం శ్ర‌మిస్తున్నా.. త‌గ్గ‌డం లేదు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ముఖ్యంగా ఎల్బీ న‌గ‌ర్ తో పాటు ప‌లు ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఉంటుంది. కాగ ఎల్బీ న‌గ‌ర్ లో ట్రాఫ‌క్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌ర్ పాస్ ను నిర్మించ‌ని విషయం తెలిసిందే. కాగ రూ. 9.28 కోట్ల వ్య‌యంతో నిర్మించిన‌ ఎల్బీ న‌గ‌ర్ అండ‌ర్ పాస్ ను నేడు రాష్ట్ర మున్సిప‌ల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించ‌నున్నారు.

అలాగే రూ. 28.64 కోట్ల వ్య‌యంతో నిర్మించిన‌ బైరామ‌ల్ గూడ పై వంతెన‌ను కూడా మంత్రి కేటీఆర్ ఈ రోజే ప్రారంభించ‌నున్నారు. కాగ విజ‌య‌వాడ జాతీయ రాహాదారి పై ఎల్బీ న‌గ‌ర్ చైరస్తా ఉండ‌టంతో.. అంత్య‌త ర‌ద్దీ గ‌ల చౌర‌స్తాగా మారింది. ఇక్క‌డ నుంచే వ‌రంగ‌ల్, న‌ల్ల‌గొండ వంటి ప్ర‌ధాన న‌గ‌రాలకు కూడా రాక‌పోక‌లు ఉండ‌టంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డానికి ఈ అండ‌ర్ పాస్ ను నిర్మించారు.

ఈ అండ‌ర్ పాస్ నేటి అందుబాటులోకి రావ‌డంతో ఎల్బీ న‌ర‌గ్ చౌర‌స్తా.. లో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడిన‌ట్టే. అలాగే శంషబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆరాంఘ‌ర్, మిధాని మీదుగా ఉండే ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డానికి దాదాపు రూ. 29 కోట్ల‌తో బైరామ‌ల్ గూడ ప్లైఓవ‌ర్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించింది. ఈ ఫ్లై ఓవ‌ర్ ను కూడా మంత్రి కేటీఆర్ ఈ రోజే ప్రారంభించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version