చేవెళ్ల రాజకీయం తెలుసా??

-

తెలంగాణలో రాజకీయ చైతన్యం గల నియోజకవర్గంగా చేవెళ్ల కు పేరు ఉంది. ఎందరో మహామహులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత చేవెళ్లది. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న చేవెళ్ల అన్ని సంస్కృతుల కలయికగా ఉంటుంది. పల్లె,పట్టణ,పారిశ్రామిక వాడలు అన్నీ కలగలిపిన వాతావరణం చేవెళ్లలో కనిపిస్తుంది.

కొండా వెంకట రంగారెడ్డి, పి ఇంద్రారెడ్డి, పీ సబితా ఇంద్రారెడ్డి వంటి ఎందరో గొప్ప రాజకీయ నాయకులను అందించిన నియోజకవర్గ చేవెళ్ల. ఈ నియోజకవర్గం వ్యవసాయ రంగంలోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ,పారిశ్రామికంగానూ ముందుకు దూసుకుపోతోంది. చేవెళ్ల ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఇక్కడ బీసీ, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. చేవెళ్లలో వీసా దేవుడు గా ప్రఖ్యాతిగాంచిన చిలుకూరి బాలాజీ గుడి ఉంది. జింకల పార్కు,పోలీసు కుక్కల శిక్షణ కేంద్రం, డిఆర్డిఏ శిక్షణ కేంద్రం మొదలైనవన్నీ చేవెళ్ల నియోజకవర్గం లోనే ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ పని మొదలుపెట్టిన చేవెళ్ల నుండే మొదలు పెట్టేవారు. అంతర్జాతీయ కంపెనీల రాకతో చేవెళ్ల ఎందరో వలస కార్మికులకు ఉపాధి నిలయంగా మారింది.

విశ్రాంత ఉద్యోగులకు,రాజకీయ నాయకులకు చేవెళ్ల విడిది కేంద్రంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడి ఫామ్ హౌస్ లు సినీ షూటింగ్ లు, సీరియల్ షూటింగ్ లతో ఎప్పుడూ హడావిడిగానే ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పటి తెలంగాణలో గాని రాజకీయంగా చక్రం తిప్పుతున్న నేతలలో ప్రముఖులందరూ చేవెళ్లకు చెందినవారే. మొదటి నుండి చేవెళ్లలో కాంగ్రెస్ దే హవా. మరి ఇప్పుడు ఏ పార్టీ వారిని చేవెళ్ల చేరదీస్తుందో?

అన్ని రంగాలలోనూ అతి వేగంగా ముందుకు దూసుకుపోతున్న చేవెళ్లలో జెండా పాతాలని బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతున్నాయి. మరి చేవెళ్ల వాళ్ళు ఎవరిని గెలిపిస్తారో?

Read more RELATED
Recommended to you

Exit mobile version