దసరాకు ముందే కొండెక్కిన చికెన్‌ ధరలు..కిలో రూ.300!

-

మాంస ప్రియులకు ఊహించని షాక్‌ తగిలింది. చికెట్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో చికెన్ రేట్ ల పై ఫ్లడ్ ఎఫెక్ట్ పడింది. దీంతో గడిచిన మూడు వారాలుగా పెరిగిపోతున్నాయి చికెన్ రేట్లు. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 వరకు పలుకుతున్నాయి చికెన్ రేట్స్‌. రేట్స్‌ పెరగడం తో సగానికి సగం తగ్గిపోయాయి చికెన్ అమ్మకాలు. కొన్ని చోట్లు కిలో చికెన్‌ రూ.300 కూడా అమ్ముతున్నారట. అమ్మకాలు తగ్గినా చికెన్ కు భారీగా డిమాండ్ ఉంటోంది.

Chicken prices have gone up before Dussehra

విజయవాడ ప్రాంతంలో వరదల్లో భారీగా కోళ్లు ,కోళ్ల ఫారాలు..కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర జిల్లాల పౌల్ట్రీ ల నుండి విజయవాడ ప్రాంతాలకు తరలిపోతున్నాయి కోళ్లు. దసరా నవరాత్రులు ప్రారంభమైతే ,చికెన్ రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ వర్గాల నిపుణులు. చికెన్ రేట్లు పెరిగిపోవడంతో మాంసాహారులు అసంతృప్తి కనిపిస్తున్నారు. మరోవైపు వరద ప్రభావం పేరుతో మార్కెట్లో నిత్యావసరాలు ,కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news