Chicken prices : మాంసం తినేవారికి బిగ్ షాక్. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. కార్తీక మాసం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, గుంటూరు నగరాల్లో కేజీ రూ.220 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. కార్తీకమాసంలో వినియోగం తగ్గడంతో కేజీ రూ.150 వరకు పడిపోయిన ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఉత్పత్తికి, డిమాండ్కు వ్యత్యసం ఏర్పడుతుందని తెలిపారు.
ప్రస్తుతం పెళ్లిళ్లు మరియు ఫంక్షన్ సీజన్ కావడంతో చికెన్ రేట్లు భారీగా పెరిగాయని అలాగే సామాన్య ప్రజలు కూడా చికెన్ వైపే మొగ్గు చూపుతుండడం కూడా ఒక కారణం అని అంటున్నారు.. చికెన్ రేట్లు పెరగడంతో నాన్ వెజ్ ఎక్కువ తినేవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చికెన్ తో పాటు మొన్నటి దాకా ఐదు రూపాయలు ఉన్న కోడిగుడ్డు ప్రస్తుతం కార్తీక మాసం ముగియడంతో ఏడు రూపాయలకు చేరుకుంది. అలాగే కూరగాయల ధరలు కూడా అధికంగా ఉన్నాయని దీనికి కారణం అధిక డిమాండ్ అని వ్యాపారస్తులు చెబుతున్నారు.