Mr Bachchan : ‘మిస్టర్ బచ్చన్’ గా వచ్చేస్తున్న రవితేజ

-

Mr Bachchan : ‘మిస్టర్ బచ్చన్’ గా వచ్చేస్తున్నాడు మాస్‌ మహరాజ్‌ రవితేజ. మాస్ మహారాజ రవితేజ ఊర మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మాస్ మహారాజ రవితేజ ఊర మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ అనే టైటిల్ అనౌన్స్‌ చేశారు.

Ravi Teja In And As Mr Bachchan

ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అలాగే.. మాస్ మహారాజ రవితేజ ఊర మాస్ పోస్టర్‌ కూడా వదిలారు. బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే రవితేజతో ఈ సినిమాలో జతకడుతోంది. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడల్‌గా ఫేమ్‌ సొంతం చేసుకుని.. పలు బ్రాండ్స్‌ కోసం వాణిజ్య ప్రకటనకర్తగానూ వ్యవహరించింది.

క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ సిల్క్‌ చాక్లెట్‌ యాడ్‌ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘యారియాన్ 2’ అనే బాలీవుడ్‌ చిత్రంతో భాగ్యశ్రీ నటిగా తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె రాజ్యలక్ష్మి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ లో ఛాన్స్ కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version