ఎస్సీ వర్గీకరణపై రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం..24 గంటల్లోనే !

-

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించిన సీఎం రేవంత్‌ రెడ్డి… వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Chief Minister Revanth Reddy directed the authorities to take necessary steps to implement the Supreme Court verdict on SC classification.

2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించిన సీఎం రేవంత్‌ రెడ్డి… 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి….సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news