రంజాన్ సందర్భంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. అటు వక్ఫ్‌బోర్డు, జీహెచ్ఎంసి, మైనార్టీ శాఖ , పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నారు ప్రత్యేక ప్రార్థనలు. ప్రార్థనల సందర్భంగా ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మీరాలం ఈద్గా, చార్మినార్, సైదాబాద్, ఏక్ మీనార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంజాన్ పర్వదినం సందర్బంగా షబ్బీర్ అలీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.