రేవంత్ రెడ్డి పై చీకోటి ప్రవీణ్ పోటీ… కొడంగల్ లో రసవత్తర పోరు !

-

కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నది. ఎలాగైనా కొడంగల్ నియోజకవర్గంలో… పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఓడించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపిన సీఎం కేసీఆర్… కొడంగల్ నియోజకవర్గం పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డికి మరో షాక్ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా చీకోటి ప్రవీణ్ ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. మరో రెండు రోజుల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ లిస్టులో కొడంగల్ నియోజకవర్గం అభ్యర్థిగా చీకోటి ప్రవీణ్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టేందుకు… సరైన అభ్యర్థి చీకోటి ప్రవీణ్ అని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజంగా చీకోటి ప్రవీణ్ బరిలోకి దిగితే… కొడంగల్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదు. కాగా ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news