వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీవే.. ఆ దిశగా మనం కష్టపడాలి : సజ్జల భార్గవ్

-

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రతిక్షణం పాటు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమ కాకుండా.. అవినీతిని నిర్మూలించడానికి నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. యూకే వైసీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేత ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో లండలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సమావేశంలో సజ్జల భార్గవ్ పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తూ.. అవినీతిపరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగన్ నిలిచారని సజ్జల భార్గవ్ అన్నారు. దుష్టచతుష్టయం నుంచి ఏపీని కాపాడే జగనన్నకు అందరం అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. ఏపీలో గ్రామాలను సీఎం జగన్ ఎంత అభివృద్ధి చేశారో.. భారత్ వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారని ఎన్​ఆర్ఐలతో అన్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175/175 టార్గెట్​గా అందరం కలిసి చేద్దామని పిలుపునిచ్చారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సమావేశంలో సజ్జల భార్గవ్​తో పాటు ఎపీఎన్​ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్, ఏపీఎస్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, వైసీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. మరోవైపు యూకే నలు మూలల నుంచి 450 మందికి పైగా వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news