ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఘటన.. బాలుడి పై బాలల హక్కుల కమిషన్ కేసు నమోదు

-

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడికి యత్నించిన విషయం తెలిసిందే.  విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థి పై చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపాల్ జోసెఫ్ తెలిపారు.

మరోవైపు 9వతరగతికి చెందిన విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల్లో బాలుడు, మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై బాలల హక్కుల కమీషన్ కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథానాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది బాలల హక్కుల కమిషన్. ఈ ఘటన పై  పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని ఆదేశించిన బాలల హక్కుల కమిషన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version