కేసీఆర్‌కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. 80 సీట్లు గెలుస్తామని ఎన్నికల ప్రచారంలో ఎంతో ధీమాగా చెప్పినా.. కనీసం 40 సీట్లు కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇటీవలే కేసీఆర్ ను కలిశారు.

మరోవైపు కేసీఆర్ ఇవాళ ఆయన సొంత గ్రామ ప్రజలైన చింతమడక వాసులు కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ ను కలవడానికి ఆ గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసీఆర్ ను కలిసి ఆయనకు సంఘీభావం తెలిపారు.  ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆయన వెంటే ఉన్నామంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామస్థులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news