తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. భద్రచాలం, చార్మినార్, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అతి తక్కువ రౌండ్లు ఏర్పాటు చేశారు.
చార్మినార్ నుంచి తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. చార్మినార్ లో లెక్కించాల్సిన 94, 830 ఓట్లు మాత్రమే కావడం గమనార్హం. చివరిగా శేరిలింగంపల్లి ఫలితం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొత్తం 49 కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు.