TS ASSEMBLY : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు…పోలీసులకు మధ్య వాగ్వాదం

-

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు…పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీలులేదని నిలువరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు మార్షల్స్. దీంతో నిరసన తెలపడం మా హక్కు..కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని..వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం రేవంత్‌ ఇలాంటివి మాట్లాడకూడదని ఆగ్రహించారు. పోడియం చుట్టిముట్టి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీలు.. అందోళన చేయండంతో సభను 10 నిమిషాల వాయిదా వేశారు కౌన్సిల్ చైర్మన్ గుత్తా.

Read more RELATED
Recommended to you

Latest news