టెడ్డీ డే ఎలా జరుపుకుంటారు?

-

ప్రేమికులకు ఈ వారం రోజులు పండగలానే ఉంటుంది.. ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా.. ఈరోజు ఫిబ్రవరి 10న టెడ్డీగా జరుపుకుంటారు. అసలు చాలామందికి ఈరోజులు ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు.. మన లాంటి సింగిల్స్ గాళ్లను అడిగితే.. ఏముంది పైసలు వదిలించుకోడానికి ఇదొక మార్గం అంటూ నవ్వుతారు.. కానీ వాలెంటైన్స్ వీక్ లో జరుపుకునే ప్రతి డేకు ఒక బలమైన కారణం ఉంది.. చాలమందికి ఈ డేస్ సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ తెలియదు. మనం ఈరోజు చూద్దాం.. ఈ టెడ్డీ డేను ఎందుకు జరుపుకుంటారు అని..

ఈ రోజున తమ ప్రియమైన వారికి టెడ్డీని కొని ఇస్తారు. కొంత మంది టెట్డీ బదులు ఇంకేదైనా బొమ్మ కూడా కొని ఇస్తుంటారు. అయితే.. ఎక్కువ మంది ప్రేమికులు తమ ప్రియమైన వారికి టెడ్డీని కొని ఇస్తారు. ఎందుకంటే.. టెడ్డీ బేర్ అనేది అమ్మాయిలకు ఇష్టమైన బొమ్మ. చాలామంది అమ్మాయిలకు టెడ్డీబేర్ అంటే..ఎక్కడలేని ప్రేమ. బాధొచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా..ఆ టెడ్డీని కౌగిలించుకుని పంచుకుంటారు. చిన్నప్పటి నుంచి అది వారికి తోడుగా ఉంటుంది.

తల్లిదండ్రులు పక్కన లేనప్పుడు బాలికలు మెత్తటి, భారీ టెడ్డీ బేర్‌ని తోడుగా ఉంచుకుంటారు. అలా వారికి టెడ్డీ బొమ్మతో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. పెరిగి పెద్దయ్యాక కూడా వారు దానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వాలెంటైన్స్ వీక్ లో టెడ్డీ బొమ్మను గిఫ్టుగా ఇస్తే…ఆ అమ్మాయికి అవధులు లేని ఆనందమే.

ఇప్పుడు మార్కెట్ లో రకరకాలై టెడ్డీలు ఉన్నాయి.. కొన్ని టెడ్డీలు అయితే.. స్మార్ట్ మొబైల్ ఆధారంగా పనిచేస్తున్నాయి. అవి మనతో మాట్లాడగలవు. మరికొన్నింటిలో అలారం క్లాక్ ఉంటుంది. ఇంకొన్నింటికి కళ్లలో రంగులు మారుతుంటాయి. ఇలా ఎన్నో రకాలున్నాయి. ఎవరికి ఎలాంటి టెడ్డీ బెటరో ఆలోచించుకొని కొని ఇస్తే.. ఆ గిఫ్టును వారు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు.

టెడ్డీ డే ఎలా జరుపుకుంటారు?

ఫిబ్రవరి 10న జరిగే టెడ్డీ డే కోసం గిఫ్ట్ ఇచ్చేందుకు సరైన టెడ్డీని ఎంచుకున్నాక… దాన్ని ప్యాక్ చేయించి.. దానిపై విషెస్ మెసేజ్ రాయిస్తారు. లేదా దాన్ని డైరెక్టుగా ఇస్తూ.. విషెస్ చెబుతారు. కొంతమంది టెడ్డీతోపాటూ.. రోజ్, చాకొలెట్ కూడా ఇస్తారు. ఇవేమీ లేకుండా కొంతమంది… జస్ట్ టెడ్డీడే విషెస్ చెబుతారు. ఎలా చెప్పారన్నదాని కంటే.. ఎంత మనస్ఫూర్తిగా చెప్పారన్నదే ముఖ్యం. ప్రియమైన వారిపై ఎంత ప్రేమ ఉంది అనేది చాటేందుకే ఈ రోజాలు, టెడ్డీలు, ఏవైనా. ఇవేవీ లేకుండా కూడా ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు. మీరు ఇచ్చే గిఫ్ట్ మీరు లేని లోటును భర్తీచేస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా సరే..మీరు ఇవ్వటమే అక్కడ మ్యాటర్.

సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకుందాం..

ఈ విషెస్‌ని వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటి సోషల్ మీడియా సైట్లలో మీ ప్రియమైన వారికి షేర్ చేసుకోండి. టైం లేకపోతే. .ఇలా మీ మనసులో మాటను పంపి మీ ప్రియమైన వారిని కూల్ చేయొచ్చు.

ప్రేమ లాగే నువ్వు నాకు శాశ్వతం. ఆ మెత్తటి బొమ్మ లాగే నువ్వూ అందమైన దానివి. నా హృదయంగా భావిస్తూ ఈ టెడ్డీని తీసుకో. ఇందులో నా ప్రేమను, ఆనందాన్నీ నింపాను. హ్యాపీ టెడ్డీ డే.

నీ కోసం సాఫ్ట్ టెడ్డీలా మారిపోతా. జీవితాంతం నీకు తోడుగా ఉంటా. హ్యాపీ టెడ్డీ డే.

నీ చెంతకు రాగానే నేను కోరుకునే ప్రేమ నాకు దొరుకుతోంది. హ్యాపీ టెడ్డీ బేర్ డే నా ప్రియతమా.

నా టెడ్డీ మెత్తగా, సిల్లీగా ఉంటుంది. ఇది నాకు నిన్ను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది నా ఫీలింగ్స్ నీకు చెబుతుంది. దీన్ని టచ్ చేసిచూడు… నా ప్రేమ ఫీల్ తెలుస్తుంది. హ్యాపీ టెడ్డీ డే.

నా ప్రేమకు ప్రతిరూపం ఈ టెడ్డీ. హ్యాపీ టెడ్డీ బేర్ డే.

ఈ క్యూట్ టెడ్డీ బేర్ నా క్యూట్ ఫ్రెండ్ కోసం. క్యూట్ సీజన్‌లో ఇస్తూ చెబుతున్నా హ్యాపీ టెడ్డీ బేర్ డే.

జీవితం చిన్నది. గతాన్ని మర్చిపోవాలి. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. ప్రజెంట్‌ని ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ టెడ్డీ డే ప్రియతమా.

ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇచ్చే రోజా పువ్వులు ఉండేది ఒక్క రోజే. అందుకే లాంగ్ లవ్‌ని వ్యక్తం చేసేందుకు టెడ్డీ బేర్‌. హ్యాపీ టెడ్డీ డే.

హ్యాపీ టెడ్డీ డే. మరి టెడ్డీ ఏది అని అడక్కు. మన మధ్య టెడ్డీ ఎందుకని ఇవ్వట్లేదు.

నీతు నేను అన్ని వేళలా ఉండటం సాధ్యం కాదు కదా..నా గుర్తుగా ఈ టెడ్డీ..

ప్రేమ అనేది..కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేని అద్భతమైన సంపద..జీవితంలో మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లను పొందడం చాలా కష్టం.. కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లు మనతో జీవితాoతం ఉండలేరు.. మీరు ఎప్పుడైన బీచ్ లకు వెళ్తే.. మీ ప్రియమైన వారి పేరు అక్కడ రాసే ఉంటారు కదా.. కాసేపటకి అలలు వచ్చి అది చేరిపేస్తాయి.. అప్పుడు మనకు కొంచెం బాధనిపిస్తుంది.. శాశ్వతంగా ఉండాలంటే రాయల్సింది రాళ్ల మీద కదా.. మరి అక్కడెందుకు రాశావ్..అది ఒక చెప్పలేని ఆనందం అంతే.. అలాగే.. వర్కౌట్ కాదని తెలిసి కూడా రిలేషన్ షిప్ లోకి దిగుతాం..ఎందుకంటే..ఆ వ్యక్తితో వచ్చే ప్రేమ, ఆనందం మరేదైనా సరే.. ఇంకెవరితో రాదు.. మరి ఆ హ్యాపీనెస్ నెల అయినా సంవత్సరం అయినా.. చాలు.

ఆ తర్వతా విడిపోయినప్పుడు బాధనిపించినా.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి. ఇష్టపడిన వారితో కొన్నాళ్లైనా హ్యాపీగా ఉన్న ఫీల్ ఉంటుంది చూడూ.. అది ఇక దేంట్లో రాదు.. ఈ టెడ్డీ డే రోజు.. కొందరు ఇప్పటికే ప్రేమికులగా ఉండి ఉంటారు.. మరికొందరు విడిపోయి ఉంటారు.. ప్రేమలో పడ్డా లేచినా అది ఎప్పటికీ ఒక తియ్యటి జ్ఞాపకమే.. ఆ మధురిమలు సింగిల్స్ కేం తెలుసు.. హ్యీపీ టెడ్డీ డే..!

Read more RELATED
Recommended to you

Latest news