ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య మళ్లీ గొడవలు ?

-

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో పట్టు కోసం ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరు లీడర్ల మధ్య మౌన పోరాటం కొనసాగుతోంది. జగిత్యాల అభివృద్ధికి పోటాపోటీగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులను కలుస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

Clashes again between MLA Sanjay and MLC Jeevan Reddy

జగిత్యాల యావర్ రోడ్డు అభివృద్ధికి 100 కోట్లు నిధులు కావాలని రేవంత్ ని కలిశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత 15 రోజుల క్రితమే రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ నుండి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ లో నీటి వసతి కోసం దాదాపు 14 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చారట సంజయ్ కుమార్. నూక పల్లి,అంతర్గం లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మౌలిక వసతులకు 18 కోట్ల నిధులను తీసుకు వచ్చారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అదే ప్రాంతంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కెసిఆర్ నగర్ పేరు ను మార్చి ఇందిరమ్మ ఇండ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను తిరిగి లబ్ధిదారులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇలా జగిత్యాల అభివృద్ధికై నిధుల సేకరణలో పోటీపడుతున్నారట ఇద్దరు నాయకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version