స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌పై కక్ష కట్టారు : భట్టి

-

రాష్ట్రంలో అకాల వర్షాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వరద నష్టంపై ఇప్పటివరకు ప్రభుత్వం అంచనా వేయలేదని తెలిపారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేవన్నారు.

ఈ నెల 9 నుంచి 15 వరకు ప్రతి జిల్లాలో 75 కి.మీ.ల పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌కు తాళం వేశారని ఆక్షేపించారు. స్వాతంత్య్రం తీసుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ నెల 16 నుంచి రెండు, మూడు రోజుల పాటు సీఎల్పీ బృందం భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. కడెం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నట్టు చెప్పారు. వరద బాధితుల గోడును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వాలు వరద బాధితులకు పరిహారం అందేలా చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version