ధరణి తీసేసి దందాలు చేయాలని కాంగ్రెస్‌ చూస్తోంది : కేసీఆర్

-

ధరణి పోర్టల్‌ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధరణి ద్వారా దళారులు లేకుండా పోయారని చెప్పారు. ఈ పోర్టల్ ఉండటం వల్ల రైతులు గడప దాటకుండా ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం అని రాహుల్‌ అంటున్నారని మండిపడ్డ కేసీఆర్.. ధరణి తీసేస్తే రైతుబీమా, రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ తీసేసి కాంగ్రెస్ పార్టీ దందాలు, స్కామ్లు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.

“పంజాబ్‌ను అధిగమించి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. లోయర్‌ మానేరు డ్యామ్‌ గతంలో ఎలా ఉండేది? లోయర్‌ మానేరు డ్యామ్‌ ఉన్నా తాగేందుకు నీళ్లు ఉండేవి కావు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎల్‌ఎండీకి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం. భాజపాకు మత పిచ్చి తప్ప ఏం లేదు. దేశంలో 157 వైద్య కళాశాలలను కేంద్రం పెట్టింది. 157 కళాశాలల్లో ఒక్కటి కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదు. కేంద్రం ఇవ్వకున్నా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 4 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశాం. చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. చట్టం ఉన్నా తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు.” అని కేసీఆర్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version