సర్పంచ్‌లపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “స్వచ్ఛ భారత్ సర్వేక్షణ ” లో తెలంగాణకు 13 అవార్డులు సాధించడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. “స్వచ్ఛ భారత్ సర్వేక్షణ ” లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు.
గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద పలు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుంది
‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచులను, ఎంపిటిసి లను, గ్రామ కార్యదర్శులను, సీఎం కేసిఆర్ అభినందించారు.” అప్రతిహత ప్రగతి తో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపర ను కొనసాగిస్తాం ’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.