వరద ప్రవాహంలో చిక్కుకున్న మొరంచపల్లి గ్రామస్థులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా మొరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే ముగ్గురు గ్రామస్తులు వరదలో కొట్టుకుపోగా… ఇళ్లలోని సామాన్లు వరద పాలవుతున్నాయి.
ఊరంతా నీరు చేరడంతో ప్రజలు మిద్దెలపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే వరద ప్రవాహంలో చిక్కుకున్న మొరంచపల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పరిస్థితులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అటు నీట మునిగిన మొరంచపల్లె గ్రామ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.