ఈడి, బోడీలకు భయపడను.. ఏం పీక్కుంటారో పీక్కోండి – కెసిఆర్

-

ఈడి, బోడీలకు భయపడను.. ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ మునుగోడు ప్రజా దీవెన సభలో బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. నన్ను ఈడీ కేసులు పెట్టి జైల్లో పెడతామంటూ బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని.. ఈడి, బోడి కాదు మోడీ.. ఏం పీక్కుంటావో పీక్కో అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దొంగలు, లంగలు భయపడతారు, నేను భయపడను అని అన్నారు. నీ అహంకారమే నీ పతనానికి నాంది అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.

నిన్ను నీ చేతలే పడగొడతాయి.. తస్మాత్ జాగ్రత్త బిడ్డా! అంటూ మోడీకి వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈడీ వోడు వస్తే నాకే చాయ్ తాగి పిచ్చి పోవాలి.. దొంగలు భయపడతారు కానీ ధర్మంగా ఉన్న వాళ్లకు భయం ఎందుకు అని అన్నారు. నువ్వు గోకినా.. గోకకున్నా నేను గోకుతా అంటూ ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలను ఆషామాసిగా తీసుకోవద్దని.. భారీ మెజారిటీతో గెలవాలని అన్నారు. ఆలోచించి ఓటు వేయాలని మునుగోడు ప్రజానీకానికి సూచించారు సీఎం కేసీఆర్.

పెన్షన్లు, కరెంటు ఉన్న వసతులను ఉడగొట్టుకుందామా? మహిళలు ఇంటికి వెళ్లి చర్చ చేయాలని సూచించారు. మునుగోడు రైతులు బోరు కాడ దండం పెట్టి ఓటేయాలని అన్నారు సీఎం కేసీఆర్. మునుగోడు అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రసంగాన్ని ముగించారు సీఎం. మునుగోడు లో మరోసారి సభ పెడదామని.. అప్పుడు వేరే వాళ్ళని తీసుకొస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version