రేపటినుండే మద్యం అమ్మకాలు షురూ.. అన్నీ జోన్లలో

-

తెలంగాణాలో మద్యం అమ్మకాలకు సిఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. కేబినేట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ రెడ్ జోన్ జిల్లాల్లో కూడా మద్యం షాపులు ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. కంటైన్మేంట్ జోన్ లో మాత్రం మద్యం అమ్మకాలు ఉండవు అని స్పష్టం చేసారు. 16 శాతం మద్యం ధరలను పెంచుతున్నామని అన్నారు.

భౌతిక దూరం పాటించకపోతే మాత్రం వైన్ షాపు సీజ్ చేస్తామని అన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. మాస్క్ లేకపోతే మద్యం అమ్మకాలు జరగవు అని, కంగారు పడకుండా కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ తర్వాత కూడా మద్యం ధరలు ఇవే కొనసాగుతాయని ఆయన వివరించారు. నో మాస్క్ నో లిక్కర్ అని స్పష్టం చేసారు.

ఒక‌ళ్ల మీద ఒక‌ళ్లు ప‌డి కంగాళీ ఎందుకువ‌య్యా.. జ‌ర మెల్ల‌గ పొయ్యి కొనుక్కోర్రి అని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో పబ్ లు బార్లకు అనుమతి ఉండదు అని పేర్కొన్నారు. పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, వైన్ షాపులను గమనించాలి అని స్పష్టం చేసారు. భౌతిక దూరం విషయంలో షాపులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నాటా సారా విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక రైతుల విషయంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల తీరుని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ లో తాను సాగు నీరు గురించి ప్రజెంటేషన్ ఇస్తే కనీసం వినలేదు అని ఆయన మండిపడ్డారు. ప్రజా రవాణా అనుమతించడం లేదని స్పష్టం చేసారు. రాజకీయ పార్టీలకు సంస్కారం లేదని, బ్యాలెట్ పేపర్లతో నిర్వహించే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఓడిపోయాయి అని ఆయన ఆరోపించారు. విపక్షాలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు కేసీఆర్.

15 తర్వాత ఆర్టీసి నడిపే అవకాశం ఉందని చెప్పారు. ఆటోలకు గ్రీన్ జోన్ లో అవకాశం ఉందని పేర్కొన్నారు. క్యాబ్ లకు ఆరెంజ్ జోన్ లో అవకాశం ఉందని పేర్కొన్నారు. 20 మందితో పెళ్లి చేసుకోవచ్చని, చచ్చిపోతే 10 మందితో చేసుకోవచ్చు అని ఆయన సూచించారు. కేసుల సంగతి ఆరోగ్య శాఖ చూసుకుంటుంది అని ఆల్ పార్టీలు అనవసరంగా హడావుడి చేయవద్దు అని ఆయన హితవు పలికారు. ఆల్ పార్టీలు నిర్వహించే చర్చలు ఒక చర్చలా అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news