వరి సాగు, రైస్ మిల్లుల పై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

-

వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతాంగాన్ని తమ ఉత్పత్తులను విశ్వ విఫణిలో విక్రయించి మరిన్ని లాభాలు ఆర్జించే స్థాయికి చేరుస్తామనీ, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

ఈ దిశగా, వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచ ప్రఖ్యాత రైస్ మిల్ కంపెనీ జపాన్ కు చెందిన సటేక్ కార్పోరేషన్ (Satake Corporation) ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, సీఎస్ శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగి, దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నది.ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, వారు పండించిన పంటకు లాభాలను ఆర్జించి పెట్టే మార్కెటింగ్ విధానాలను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version