తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వైద్య విద్యను మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్యకళాశాలల ప్రారంభానికి ఇవాళ ముహుర్తం ఖరారైంది. తెలంగాణ సర్కార్ నూతనంగా నిర్మించిన ఈ ఎనిమిది వైద్య కళాశాలల్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఏకకాలంలో ఆన్లైన్ ద్వారా తరగతులను ప్రారంభించనున్నారు.
నేడు ఈ ఎనిమిది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఏకకాలంలో తరగతులు మొదలుకానున్నాయి. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల సహా వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం వైద్య కళాశాలల్లో విద్యాబోధన మొదలు కానుంది. దీంతో ఎనిమిది కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కోర్సు చదివే విద్యార్థుల విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది