మునుగోడులో కేసీఆర్ సర్వే.. గెలిచేది ఆ పార్టీనేనట

-

మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని.. సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తాను నిర్వహించిన అలాగే.. ఇతరులు నిర్వహించిన సర్వేల్లో తమ పార్టీకే అనుకూలంగా రిపోర్టు వచ్చిందని.. తెలిపారు. 41 శాతం ఓట్లతో విజయం సాధిస్తామన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో.. బీజేపీకి మూడో స్థానంలో ఉంటుందని చెప్పారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ లకే సీట్లు ఇస్తామని.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తీపికబురు చెప్పారు. ఇప్పటి నుంచే.. పార్టీ అభివృద్ధికి.. గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version