ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పాగా వేస్తుంది : సీఎం కేసీఆర్

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోబోతోందని ఆ జిల్లా పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానమే దక్కిందని అన్నారు. ఈసారీ ఖమ్మం స్థానాలను పక్కనబెట్టినా 80 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని…అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం చెప్పినట్లు తెలిసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి కనీసం ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని.. కొద్దిగా కష్టపడితే 8 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ విశ్లేషించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి బుధవారం ప్రగతిభవన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. సీఎంతో సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news