‘ఫ్యామిలీ మ్యాన్‌-3’ షూటింగ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

-

ఇండియన్ వెబ్ సిరీస్​ల్లో అత్యంత పాపులారిటీ దక్కించుకున్న సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే రెండు సీజన్లతో ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించింది. ఇక మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఈ సిరీస్ 3 పార్ట్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఫ్యామిలీమ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే దీనిపై స్పందించారు. ఈ ఏడాది చివరి నాటికి ‘ఫ్యామిలీమ్యాన్‌-3’ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.

‘‘ప్రస్తుతం మా ముందు చాలా అంశాలున్నాయి. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇది అయిన వెంటనే ‘ఫ్యామిలీమ్యాన్‌-3’ పనులు మొదలు పెడతాం. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ఇక ‘ఫర్జీ2’కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం మా ప్రాధాన్యం ‘ఫ్యామిలీమ్యాన్‌3’కు మాత్రమే. ‘సిటడెల్‌’ షూట్‌ దాదాపు పూర్తయింది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి దిగ్విజయంగా పూర్తి చేశాం. చాలా బాగా వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news