నేడు యాదాద్రి ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్య‌టించ‌నున్నారు. యాదాద్రి దేవాల‌య పున‌ర్నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. అలాగే ప‌నుల పురోగ‌తిని స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అధికారుల‌కు నిర్మాణంపై ప‌లు సూచ‌న‌లు కూడా చేయ‌నున్నారు. యాదాద్రి ఆల‌యాన్ని ప్ర‌పంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దాల‌ని సీఎం కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీని కోసం సీఎం కేసీఆర్ ప్ర‌త్య‌క చోరువతో నిన‌ర్నిర్మాణాన్ని ప‌రిశీలిస్తున్నారు. కాగ నేటితో యాదాద్రిలో ప‌ర్య‌టించ‌డం సీఎం కేసీఆర్ కు 17 వ సారి అవుతుంది.

ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 16 సార్లు యాదాద్రి దేవాల‌యాన్ని ప‌రిశీలించారు. తాజా గా ఈ రోజు కూడా యాదాద్రిలో పర్యాటిస్తారు. కాగ యాదాద్రి నార‌సింహ స్వామి ఆల‌య పున‌ర్ నిర్మాణ ప‌నులు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఆ పనులను సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తారు. అలాగే యాదాద్రి దేవాల‌యం స్వ‌ర్ణ క‌ల‌శాల స్థాప‌న‌కు ప‌రంజాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప‌రంజా ప‌నులను ప‌రిశీలించ‌నున్నారు. కాగ ఈ స్వ‌ర్ణ క‌ల‌శాల ను చిన్న జీయ‌ర్ స్వామి నేతృత్వంలో ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం చెన్నై నుంచి ప్ర‌త్యేక బృందాన్ని తీసుకువ‌చ్చారు. అలాగే లైటింగ్ ప‌నులు, క్యూలైన్ల ప‌నులు, ర‌క్షణ గోడ, బ‌స్ బే, స్వాగ‌త తోర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయి. వీటిని కూడా సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news