యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

-

యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. అనారోగ్యానికి గురై ఐసియు లో చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత, ఎం.పీ ములాయమ్ సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆరా తీసారు.

ఇందులో భాగంగానే.. ములాయం సింగ్ కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, అఖిలేశ్ యాదవ్ కు సిఎం కెసిఆర్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు.

ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు. అటు మంత్రి కేటీఆర్‌ కూడా సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత, ఎం.పీ ములాయమ్ సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి విచారం వ్యక్తం చేసి.. ఆయన త్వరగా కోలుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version