బంగారు భారతదేశాన్ని తయారు చేద్దాం : కేసీఆర్‌ ప్రకటన

-

బంగారు భారతదేశాన్ని తయారు చేద్దామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేశారు. నారాయణఖేడ్ లోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాసేపటి క్రితమే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. అమెరికా కంటే గొప్ప దేశంగా చేద్దామని పేర్కొన్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పని చేస్తున్నానని.. ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడదామని చెప్పారు సిఎం కెసిఆర్. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిద్దామని.. తెలంగాణ లాగే దేశాన్ని అభివృద్ధి చేద్దామని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు కెసిఆర్.

దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వలేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. అలాగే సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. మంత్రి హరీష్ రావు లాంటి నాయకుడు సంగారెడ్డి జిల్లా లో ఉండటం చాలా అదృష్టం అని పేర్కొన్నారు. అలాంటి మంత్రి ఎక్కడ లేరని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version