కాంగ్రెస్‌ నేతలు పెట్టేది భూమాత కాదు.. భూమేత : కేసీఆర్

-

రైతు బంధు దుబారా అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతుబంధు దుబారానా? అని తాండూరు నియోజకవర్గ ప్రజలను అడిగారు. ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తూ.. మరోసారి బీఆర్ఎస్​ను గెలిస్తే రైతు బంధు రూ.16వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటల కరెంట్‌ వృథా అని రేవంత్‌ రెడ్డి అంటున్నారని.. బొటనవేలు ముద్ర లేకుండా భూయాజమాన్యపు హక్కులు ఎవరూ మార్చలేరని తెలిపారు.

“ధరణి తీసేసి భూమాత పెడతాం అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు పెట్టేది భూమాత కాదు.. భూమేత. ధరణి తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు, రైతుబీమా డబ్బులు ఎలా వస్తాయి? ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్‌ ఇస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వస్తే మనకు కూడా 5 గంటల కరెంట్‌ దిక్కు అవుతుంది. రాష్ట్రంలో 3,500 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. నీటిపన్నును రద్దు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.” అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news