ధరణి కావాలా.. ధళారుల రాజ్యం కావాలా ? : సీఎం కేసీఆర్

-

నిర్మల్ లో బీఆర్ఎస్ లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో, పార్లమెంట్ డెమొక్రసీలో ప్రజలకు ఉండే వజ్రాయుధం ఓటు. మీ ఓటు మీ తలరాతను లిఖిస్తుంది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభం.. ఏ పార్టీ గెలిస్తే లాభం అనేది చూసి ఓటు వేయాలి. ప్రతీ పార్టీ చరిత్ర చూడాలి. నిర్మల్ కు మెడికల్ కళాశాల వస్తుందని ఎప్పుడైన ఊహించారా?

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఉండాలా వద్దా..? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. గిరిజనులకు పోడు పట్టాలిచ్చాం.. రైతుబంధు ఇచ్చాం.. ఇంకా ఇవ్వాల్సినవి గెలిచిన తరువాత ఇస్తామని వెల్లడించారు. రైతు బంధుపై కాంగ్రెస్ రకరకాలుగా మాట్లాడుతుంది. రైతుబంధు వేస్ట్ అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. రైతుబంధు పదం పుట్టిందే కేసీఆర్ నోట్లో నుంచి అని తెలిపారు. కాంగ్రెస్ కి రైతుబంధు, ధరణి ఉండటం ఇష్టం లేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version