చంద్రబాబు ఉన్న జైలులో విపరీతంగా దోమలు ఉన్నాయని, అవి కుట్టి ఆయన డెంగీ బారినపడి చనిపోయేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టిడిపి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణను ప్రభుత్వం ఖండిస్తుండగా… దోమల గురించి TS CM KCR మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ‘దోమ ఎమ్మెల్యే అయిన, మంత్రినైనా, ముఖ్యమంత్రినైనా కుడుతుంది. దోమ మంచి స్పెషలిస్ట్. దానికి తారతమ్యం లేదు. చెత్త ఉందంటే దోమ ఉంటది. ఉందంటే కుడుతది’ అని కేసీఆర్ అన్నారు.
అయితే.. నిన్న నారాలోకేష్.. చంద్రబాబు భద్రతపై ట్వీట్ చేశారు. దొమలు కుట్టించి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ సర్కార్ పై ఆరోపణలు చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబును పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఆన్‌లైన్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి.. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
https://x.com/KCRArchives/status/1704923767150096833?s=20