గతుకుల గజ్వేల్ ను సీఎం కేసీఆర్ బతుకుల గజ్వేల్ గా మార్చాడని వెల్లడించారు హరీష్ రావు. గెలిపించినందుకు గజ్వేల్ ప్రజల రుణం కేసీఆర్ తీర్చుకున్నాడు, వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఇచ్చి కేసీఆర్ రుణం తీసుకోవాలని ఇక్కడి ప్రజలను కోరుతున్నానని వెల్లడించారు. 3 గంటల కాంగ్రెస్ కావాలా…? 3 పంటల కేసీఆర్ కావాలా? అంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామంటున్నారు …మూడు పంటలకు కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా మూడు గంటలు కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా అని ప్రజలను అడిగారు. ఒకప్పుడు కేసీఆర్ గారు గజ్వేల్ లో గెలవక ముందు గజ్వేల్ వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని.. రోడ్లు కూడా ఉండేవి కాదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, ఈ రంగంపై ఆధారపడిన మత్స్యకారులకు ప్రత్యక్షంగా, ఈ రంగంపై ఆధారపడిన పరోక్షంగా ఉపాధి లభించేలా ప్రభుత్వం వారికి ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలనిస్తూ, చెరువుల్లో పెంచుతున్నదని వివరించారు. అయితే.. హరీష్ రావు వ్యాఖ్యలతో..సీఎం కేసీఆర్.. గజ్వేల్ నుంచే పోటీ చేస్తారని స్పష్టం అవుతోంది.